ఎనిమిదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఎనిమిదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్...

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు జీహెచ్ఎంసీ స‌హా నగరపాలిక‌లు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నుల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయ‌నున్నారు.

అసెంబ్లీ వానాకాల స‌మావేశాల‌పై క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప‌డింది. స‌మావేశాల‌కు వ‌స్తున్న స‌భ్యులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ వానాకాల సమావేశాల షెడ్యూల్‌ను కుదిస్తూ, సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో వ‌ర్షాకాల స‌మావేశాలు కొన‌సాగించే అంశంపై చ‌ర్చ న‌డుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో మండ‌లి చైన‌ర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స‌భాప‌తి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు స‌మావేశమ‌య్యారు. స‌మావేశాల కుదింపుపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై మ‌రోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాల‌ని నిర్ణ‌యించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories