నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Telangana Assembly Sessions 2022 Will End Today
x

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు

Highlights

Telangana Assembly: ఇవాళ రెండు తీర్మానాలు చేయనున్న తెలంగాణ అసెంబ్లీ

Telangana Assembly: తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు.. కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్ర విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ, కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతారు.

అనంతరం శాసనసభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ విధానం- రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై, ఉభయ సభల్లో రెండు స్వల్పకాలిక చర్చలు జరుపుతారు. రాత్రి వరకు సమావేశాలు జరిగే వీలుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories