Assembly Meeting: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly Budget Meeting Starts From Today
x

తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)

Highlights

Assembly Meeting: 18న ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి * 15 రోజుల పాటు జరగనున్న సమావేశాలు

Assembly Meeting: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 18న ఉదయం ఉభయ సభల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంలో రాబోతున్న బడ్జెట్‌పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 2021-22 ఏడాదికి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయింది. ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా వేయనున్నారు. ఇప్పటికే బడ్జెట్ సిద్ఢం అయిన నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశమయి బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేసీఆర్‌కు అందజేశారు.. ఈ బడ్జెట్ సమావేశాలను దాదాపు 15రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఇవాళ ఉదయం 11గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 16న దివంగత ప్రజా ప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం, 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక 18వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి కోలుకొని వివిధ రంగాలను పునరుద్ధరించుకునే క్రమంలో ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేల చూపులు చూస్తున్న రంగాలకు ఊపిరిలూది వాటిని తిరిగి పునరుద్ధరించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం గతఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1.82 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ సారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు పెట్టే అవకాశం ఉంది.. ప్రస్తుత రాబడి, వ్యయాలకు అనుగుణంగా పద్దులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎన్ని ఖజానాకు సమాకూరే సొంత రాబడులు ఎన్ని కేంద్ర బడ్జెట్ తర్వాత నిధులు, నిధుల కోత, బడ్జెట్ కేటాయింపుల ప్రాధాన్యతపై కూడా దృష్టి సారించారు.. గతేడాది కరోనా సమయంలో సాగు నీటి రంగానికి అత్యధికంగా ఖర్చు చేశారు ఆ తర్వాత వైద్యరంగానికి ఖర్చు చేశారు.. ఈ సారి ఎలా ఉండబోతుందో చూడాలి.

త్వరలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న గొల్ల కురుమలను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో పలు తాయిలాలను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగించినున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వాటిని మరింత పెంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు నీటి రంగానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ సారి సామాన్యులను ఆకర్షించేందుకు తెలంగాణ బడ్జెట్‌ ఉండబోతుందని తెలుస్తోంది. మరి చూడాలి బడ్జెట్‌లో ఎవరికి లాభం చేకూరుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories