పెస్టిసైడ్స్ వాడకంలో దేశంలో తెలంగాణ నంబర్-3

పెస్టిసైడ్స్ వాడకంలో దేశంలో తెలంగాణ నంబర్-3
x
Highlights

ఇక పురుగు మందుల విషయంలో తెలంగాణది టాప్-త్రీ పొజిషన్. పంజాబ్ లో హెక్టార్ కు 1250 కిలోలు, హర్యానాలో 1150 కిలోలు, తెలంగాణ 900 కిలోలు వాడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం పురుగు మందుల వాడకంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. దిల్లీకి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.స్టేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికను అంజనీ కుమార్, హిమాంశు పాఠక్‌లు రూపొందించారు.

తెలంగాణలో ఎరువులు, పురుగుల మందుల వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎరువుల వాడకంలో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. పంజాబ్ రాష్ట్రం ఎరువుల వాడకంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఒక హెక్టార్‌కు పంజాబ్ లో 482.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. హర్యానాలో 386.8 కిలోలు, బీహార్ లో 317.7 కిలోలు, యూపీలో 315.8 కిలోలు, బెంగాల్ లో 293.9 కిలోలు, తెలంగాణలో 297.5 కిలోల ఎరువులు వాడుతున్నారు.ఇక పురుగు మందుల విషయంలో తెలంగాణది టాప్-త్రీ పొజిషన్. పంజాబ్ లో హెక్టార్ కు 1250 కిలోలు, హర్యానాలో 1150 కిలోలు, తెలంగాణ 900 కిలోలు వాడుతున్నారు.


తెలంగాణలో ఎరువులు, పురుగు మందుల వాడకం ఎందుకు పెరిగింది?

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015-16 నుంచి 2021-22 మధ్య కాలంలో వరి ఉత్పత్తి 342 శాతం పెరిగింది. 45.71 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 202 లక్షల మెట్రిక్ టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు నుండే ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగింది. పంటల అధిక దిగుబడి కోసం ఎరువుల వాడకం మొదలైంది.

రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. ఎరువుల్లో నత్రజని వాడకం పెరిగింది. భూమి స్వభావం బట్టి కాకుండా అవసరం ఉన్నా లేకున్నా నత్రజని వాడకం ప్రారంభించారు. నత్రజని వాడితే పంటలకు పురుగుల బెడద కూడా అవుతుంది. అప్పుడు పురుగుల మందులు కూడా వాడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త అరిబండి ప్రసాదరావు చెప్పారు.


ఎరువులతో దెబ్బతింటున్న నేల

తెలంగాణలో వరి, పత్తి వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. పంట మార్పిడి తక్కువ. దీంతో కూడా ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా వాడాల్సి వస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమి దృఢంగా మారి నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు భూమిలో మానవులకు అవసరమైన జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు కూడ లభించకుండా పోతున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.


సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలి...

రసాయన ఎరువులు, పురుగుమందులతో పండిన పంటలను దీర్ఘకాలంగా వాడితే మనిషి ఆరోగ్యంపై ఎలాంటి దుష్ఫ్రభావాలు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పురుగుమందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానవులతో పాటు అన్ని రకాల జీవులకు నష్టమే. సేంద్రీయ పద్దతులతో వ్యవసాయం చేయడం వల్ల భూమికి కూడ లాభమేనని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

పెస్టిసైడ్స్ వాడకంలో

దేశంలో తెలంగాణ నంబర్-3ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు సూచనలు చేశారు. అయితే ఈ దిశగా ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలి. రైతులు కూడా ఈ మార్పు దిశగా అడుగులు వేయాలి. నేలతల్లిని కాపాడుకుంటూ ఆరోగ్యవంతమైన పంటల దిశగా రైతన్నలు ముందడుగు వేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories