Teenmar Mallanna Complaint: అల్లు అర్జున్, సుకుమార్, పుష్ప 2 నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు

Teenmar Mallanna Complaint: అల్లు అర్జున్, సుకుమార్, పుష్ప 2 నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
x
Highlights

Teenmar Mallanna Complaint on Pushpa 2 movie unit including Allu Arjun and Sukumar: అల్లు అర్జున్‌, సుకుమార్, పుష్ప 2 మూవీ నిర్మాతలపై కాంగ్రెస్...

Teenmar Mallanna Complaint on Pushpa 2 movie unit including Allu Arjun and Sukumar: అల్లు అర్జున్‌, సుకుమార్, పుష్ప 2 మూవీ నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో మల్లన్న ఈ ఫిర్యాదు చేశారు. తాను ఇవాళ పుష్ప 2 మూవీ చూశానని, అందులో పలు సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా, దారుణంగా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులను తక్కువ చేసి చూడటం, శాండల్ వుడ్ స్మగ్లర్లను ఎక్కువ చేసి చూపడం జరిగిందన్నారు. స్మగ్లర్ వచ్చి పోలీసు ఆఫీసర్ కారును ఢీకొట్టడం, పోలీసు ఆఫీసర్ స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోతే అల్లు అర్జున్ వెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్ లో మూత్ర విసర్జన చేయడం వంటి సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని చెప్పారు. అలాంటి సన్నివేశాలకు అసలు సెన్సార్ బోర్డ్ ఎలా క్లియరెన్స్ ఇచ్చిందని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna About Pushpa 2) ప్రశ్నించారు.

పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చిత్రీకరించిన ఆ అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి సినిమా తీసి పోలీసులను అవమానించడమే కాకుండా సమాజంలో యువతను దొంగల్లా మారే సినిమా తీసిన అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు (Teenmar Mallanna Complaint on Allu Arjun and Sukumar).

ఇలాంటి సినిమాలు చూసి యువత చెడిపోతే ఎవరిది బాధ్యత అని పుష్ప 2 మూవీ యూనిట్‌ను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సినిమా వాళ్లు ఇటువంటి సినిమాలను తీసి సమాజాన్ని పాడు చేయకుండా మంచి సినిమాలు తీయాలని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna files complaint on Pushpa 2 Movie Unit) హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories