Teej Festival: ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా తీజ్ పండుగ

Teej Festival Grandly Celebrated by Tribals in Adilabad
x

ఆదిలాబాద్ జిల్లాలో తీజ్ పండుగ వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Teej Festival: తీజ్ ఉత్సవాలతో సందడిగా కనిపించిన గిరిజన తండాలు

Teej Festival: ఆధునిక ప్రపంచంలోనూ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పక్కాగా ఫాలో అవుతున్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న పండుగలతో అందరిని ఆకట్టుకుంటారు ఈ గిరిజనులు. బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతినే ఆరాధించేవే ఎక్కువగా ఉంటాయి. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని బంజారాల విశ్వసిస్తారు. అందుకే వారు జరుపుకునే ప్రతి పండగలో ఏదో ఒక దైవాన్ని తలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ప్రతీఏటా శ్రావణ మాసంలో బంజార యువతులు తమ సంస్కృతి పరిరక్షణలో భాగంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.

రాఖీ పండుగ నుంచి ప్రారంభమయ్యే తీజ్ ఉత్సవాలు గోకులాష్టమి వరకు కొనసాగుతాయి.. యువతులు సంప్రదాయబద్దంగా ఉపవాసాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో గోధుమ బుట్టలో ఉన్న తీజ్‌లకు నీళ్లు పోస్తూ పూజలు నిర్వహిస్తారు.. సాయంత్రం సమయంలో పాటలు, నృత్యాలతో తండాల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతీ ఏటా శ్రావణమాసంలో లంబాడా తండాల్లో తొమ్మిది రోజుల పాటు తీజ్ ఉత్సవాలతో జిల్లాలోని గిరిజన తండాలు సందడిగా కనిపిస్తాయి.

బంజారా గ్రామాల్లో తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మొలకెత్తిన గోధుమల బుట్టలను ఒక్క చోటికి చేర్చి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.. యువతులు, మహిళలు చీమల పుట్టలో మట్టిని తీసుకొచ్చి నానబెట్టిన గోధుమలను అందులో పోసి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దు:ఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు.. తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పండుగను కలిసి నిర్వహించుకోవడమే కాకుండా.. ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు బంజారాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories