Chandrababu Arrest: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో టీడీపీ అభిమానుల నిరసన

TDP Supporters Staged Dharna at Metro Rail Station
x

Chandrababu Arrest: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో టీడీపీ అభిమానుల నిరసన

Highlights

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ‌షర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ‌షర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో.. బాబు అభిమానులు ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల హైటెన్షన్ వాతావరణం ఏర్పాడింది. పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు భారీగా నిరసన కారులు చేరుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. టెక్నికల్ రీజన్ అని చెబుతూ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. మెట్రో అధికారులతో చంద్రబాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు.

మరోవైపు.. నల్ల చొక్కాలు వేసుకుంటే అనుమతి లేదని మెట్రో సిబ్బంది మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణిస్తూ నిరసన తెలపాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్లకు టీడీపీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. పొరపాటున నల్ల చొక్కాలు ధరించిన ప్రయాణికులు, మెట్రో సిబ్బందిని సైతం పోలీసులు అనుమతించడం లేదు అమీర్‌పేట్, ఎంజీబీఎస్ దగ్గర మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఈ ఆందోళనల నడుమ మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మెట్రో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపి వేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. మెట్రో ట్రైన్ లోపల కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమయానికి ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఆలస్యం కావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ప్రయాణికులకు నిరసన కారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నిరసన కారులను పోలీసులు బలవంతంగా దించేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories