Fake Seeds: నల్గొండ జిల్లాలో రెచ్చిపోయిన నకిలీ విత్తన మాఫియా

Task Force Police Arrested the Fake Seeds Selling Gang in Suryapet
x

పట్టుబడ్డ నకిలీ విత్తనాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Fake Seeds: నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌ బృందాల ప్రత్యేక నిఘా * నకిలీ విత్తనాల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Nalgonda: నకిలీ విత్తన మాఫియా రంగంలోకి దిగుతోంది. నకిలీ విత్తన వ్యాపారులు జిల్లాలపై దృష్టిసారించారు. నాసిరకం విత్తనాలను విక్రయించి అడ్డదారుల్లో ఆర్జించడానికి రెడీ అయ్యారు. దీంతో రైతు ఆదినుండి చివరి వరకు దగా పడుతూనే ఉన్నాడు. విత్తనాల మాయాజాలంలో పడి ఆమాయక రైతులు దగా పడుతున్నారు.

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ప్రతి ఏటా రైతులు నకిలీ విత్తనాలతో దగా పడుతున్నారు. నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటను నల్లగొండ పోలీసులు కట్టించారు. ఏపీ, తెలంగాణకు చెందిన 13 మంది నిందితులను అరెస్టు చేసి, రూ. 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, రెండు కార్లు, 13 సెల్‌ఫోన్లు, నకిలీ విత్తనాలను తయారు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన రైతుల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు 15 రోజులుగా ఈ నకిలీ దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. నైరుతి భీష్మ సీడ్స్ పేరుతో నాణ్యత లేని విత్తనాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రల్లోని కర్నూల్, హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ విత్తనాల వ్యాపారులు రైతుల జీవనాధారమైన పంటపైనే టార్గెట్‌గా చేసుకొని దెబ్బతీస్తుండడంతో అమాయక రైతులు తీవ్రంగా మోసపోవాల్సి వస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories