తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం
x
Highlights

Telangana Floods : గతకొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వర్షాల ధాటికి భారీ ఆస్థి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనితో హైదరాబాదు నగరంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.

Telangana Floods : గతకొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వర్షాల ధాటికి భారీ ఆస్థి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనితో హైదరాబాదు నగరంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోవడం విచారకరమన్నారు. ఇక తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజలకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేస్తామని.. సీఎంఆర్ఎఫ్‌ నుంచి తక్షణ సహాయం కింద పది కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

తక్షణమే రూ. 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినందుకు గాను తమిళనాడు సీఎం పళనిస్వామికి, ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞత‌లు తెలిపారు. వరద భాదితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

అటు హైదరాబాదులో మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దంచికొడుతున్నాయి వానాలు... దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నారు. జాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్‌, కాప్రా, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, ఖైరతాబాద్‌, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories