Talasani: వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ.. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల ఎంపిక

Talasani Srinivas Yadav Says Double Bedroom Houses Distribution Begin From September 2nd In Hyderabad
x

Talasani: వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ.. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల ఎంపిక

Highlights

Talasani: పేదల కోసం డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం

Talasani: దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తం 12 వేల మందికి రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్‌ అలీతో కలిసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మంత్రి తలసాని ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మొద్దని సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల సొంతిల్లు కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories