Talasani Srinivas Yadav review on Basti Dispensaries : నగరంలో మరో 10 బస్తీ దవాఖానాలు : మంత్రి తలసాని

Talasani Srinivas Yadav review on Basti Dispensaries : నగరంలో మరో 10 బస్తీ దవాఖానాలు : మంత్రి తలసాని
x
మంత్రి తలసాని యాదవ్
Highlights

Talasani Srinivas Yadav review on Basti Dispensaries : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు బస్తీల్లో ఉండే పేద ప్రజలు అనారోగ్యం పాలయితే చాలు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి ఎంగానో ఇబ్బందులను ఎదుర్కొనే వారు.

Talasani Srinivas Yadav review on Basti Dispensaries : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు బస్తీల్లో ఉండే పేద ప్రజలు అనారోగ్యం పాలయితే చాలు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి ఎంగానో ఇబ్బందులను ఎదుర్కొనే వారు. అయితే ఆ బస్తీల్లో ఉన్న పేద ప్రజలు వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచితంగా వైద్యం అందించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ దవఖానల ద్వారా ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రాణాపాయ స్థితి నుంచి పేదలు బయటపడుతున్నారు. ఇక జిల్లా‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ల ద్వారా అందుతున్న వైద్య సేవలు, పనితీరు ఇతర అంశాలపై మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్వేతా మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 95 బస్తీ దవాఖానాలతో పాటు 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రస్తుతం ప్రజలకు ప్రతిరోజూ వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో 10 బస్తీ దవాఖానాలను రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. బస్తీ దవాఖానాల లో అవసరమైన సౌకర్యాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories