దుబ్బాక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

దుబ్బాక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు...

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఐతే నేతలు మాత్రం ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పోలీసుల తనిఖీలు మాటల యుద్ధాలతో ప్రచారం నుంచి పోలింగ్ వరకు ప్రతీ రోజూ హాట్‌హాట్‌గానే కనిపించింది. వార్ వన్ సైడ్ అవుతుంది, టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అని ముందుగా అనుకున్నా తర్వాతపరిస్థితులు ఒక్కసారిగా మారాయ్. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‍‌లో చేరడం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పక్కా వ్యూహంతో ప్రచారంలో పాల్గొనడంతో ఉప ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయ్.

టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు తనదైన వ్యూహాలతో దూసుకెళ్లారు. ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇక అటు బీజేపీ కూడా సోషల్ మీడియాలో వేదికగా మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అటు ముత్యంరెడ్డి సెంటిమెంట్‌ను తీసుకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తనశైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

పోలింగ్ కూడా భారీగా నమోదుకావడంతో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పోలింగ్ సరళి పరిశీలిస్తే సైలెంట్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. పెరిగిన పోలింగ్ శాతం ఓ పార్టీకి లాభం కానుందన్న టెన్షన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. కొన్ని సర్వేలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా మరికొన్ని కమలం పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయ్. మరి దుబ్బాక జనాల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే 10వరకు ఆగాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories