Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court key directives on the appointment of Governor Quota MLC
x

Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Highlights

Telangana: హైకోర్టు ఆర్డర్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు

Telangana: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాలను తిరస్కరిస్తూ గవర్నర్ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే తమ నియామకాన్ని పక్కనబెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను ఎంపిక చేయడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు తీర్పుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అది గవర్నర్ హక్కులను హరించడం అవుతుందని వ్యాఖ్యానించింది. గతంలో కొత్త నియామకాల కోసం విడుదలైన గెజిట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories