Mano Vignana Yatra 2022: నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు మనోవిజ్ఞాన యాత్ర

SUPAR Foundation Mano Vignana Yatra 2022 in Nizamabad
x

Mano Vignana Yatra 2022: నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు మనోవిజ్ఞాన యాత్ర

Highlights

Mano Vignana Yatra 2022: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సూపర్ ఫౌండేషన్ మిషన్ మనో విజ్ఞాన యాత్ర అవగాహన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది.

Mano Vignana Yatra 2022: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సూపర్ ఫౌండేషన్ మిషన్ మనో విజ్ఞాన యాత్ర అవగాహన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంతో పాటు.. నిజామాబాద్ కాకతీయ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ సదస్సులలో.. మెంటల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, ఐఐటీ పోటీ పరీక్షలకు సమాయత్తంపై విద్యార్ధులకు నిపుణులు అవగాహన కల్పించారు.

జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమైంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్‌నర్‌గా hmtv వ్యవహరిస్తోంది.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com



Show Full Article
Print Article
Next Story
More Stories