సింగరేణి గనుల్లో వేడికి కార్మికులు విలవిల

Summer Effect on Workers in Singareni Mines | Telugu News
x

సింగరేణి గనుల్లో వేడికి కార్మికులు విలవిల

Highlights

*వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న కార్మికులు

Singareni: కోల్‌బెల్ట్ పరిధిలోని బొగ్గు గనులు మండుతున్నాయి. భానుడు రోజురోజుకూ తన ప్రతాపం చూపుతుండడంతో మైన్స్‌లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్‌బెల్ట్ ఏరియాల్లో 41 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు కొలిమై మండుతున్న కోల్‌బెల్ట్‌ను చూసి భయపడిపోతున్నారు.

ఎండలు మండిపోతుండడంతో గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేక పోతున్నారు. ఎండాకాలంలో గనుల్లో వేడిమిని తగ్గించడానికి, కార్మికులు పని చేసుకునేలా వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా వదిలేసింది. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కోల్ బెల్ట్ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఓపెన్ కాస్టుల్లో, పనిప్రదేశాల్లో అంతకన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అయినా మేనేజ్‌మెంట్ ఉపశమన చర్యలపై దృష్టి పెట్టడం లేదంటున్నారు కార్మిక సంఘాలు.

ఓపెన్ కాస్ట్ గనుల్లో, పనిచేసే చోట్ల ఏసీ సౌకర్యంతో రెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. RG-2 ఏరియాలో రెండు చోట్ల మాత్రమే ఏసీ షెల్టర్లు ఉన్నాయి. మిగతా ఓసీలల్లో తడకల పందిళ్ళు వేశారు. మరికొన్ని చోట్ల వట్టివేళ్ళ గడ్డితో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ కూర్చునే వీలు లేదు. డంపర్స్, షెవల్స్, డోజర్స్ వంటి భారీ వెహికల్స్‌లో ఏసీ ఉన్నా ఆ కార్మికులు బయటకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాట్లు లేవు. సర్ఫేస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్‌లు, సర్వే స్టాప్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎండలో మాడిపోతున్నారు.

ఏప్రిల్, మే నెలలో ఓపెన్ కాస్ట్ కార్మికులకు ఒక్కో మజ్జిగ ప్యాకెట్ ఇస్తుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతుంది. కానీ కొత్తగూడెం జీకే ఓసీలో ఇస్తున్న మజ్జిగ ప్యాకెట్లు చల్లగా ఉండటం లేదని అంటున్నారు. గతంలో ఉన్నట్టే ట్రిప్ కౌంటర్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని కార్మికులు, ఆఫీసర్లు కోరుతున్నారు. కేవలం బొగ్గు ఉత్పత్తిపై మాత్రమే దృష్టి పెట్టిన యాజమాన్యం కార్మిక సంక్షేమం కోసం పట్టించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories