Sama Ranga Reddy: బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోని సుధీర్ రెడ్డి

Sudheer Reddy Does Not Care About The Problems In BN Reddy Nagar
x

Sama Ranga Reddy: బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోని సుధీర్ రెడ్డి 

Highlights

Sama Ranga Reddy: 4 సంవత్సరాలు గడుస్తున్నా ఆ సమస్యలను పట్టించుకోని సుధీర్ రెడ్డి

Sama Ranga Reddy: హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గాలికి వదిలేశారని రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. దశాబ్దాల కాలంగా బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం కోసమే పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఆ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. బీఎన్ రెడ్డి నగర్‌లో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్‌లో బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న సమస్యలపై ఆయన ప్రశ్నించారు.

కేవలం మునుగోడు ఉప ఎన్నికల కోసమే రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం కోసం జీవోను తెచ్చారని ఆయన అన్నారు. బీ ఎన్ రెడ్డి నగర్‌లో డ్రైనేజీ రోడ్ సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు చెల్లించే పన్నులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని సామ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి నగర్‌లో నెలకొన్న సమస్యల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని సామ రంగారెడ్డి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories