దుబ్బాక ఉపఎన్నికు కట్టుదిట్టమైన ఏర్పాట్లు!

దుబ్బాక ఉపఎన్నికు కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
x
Highlights

తెలంగాణలోనే ఏకైక ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాకలో ప్రచారం ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉంది. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 10న ఫలితాలు రానున్నాయి.

తెలంగాణలోనే ఏకైక ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాకలో ప్రచారం ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉంది. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 10న ఫలితాలు రానున్నాయి. ఈక్రమంలో దాదాపు వారం రోజుల పాటు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉండనుంది.

రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దుబ్బాకలో మొత్తం 89 సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. గత ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో సీఆర్‎పీఎఫ్, తెలంగాణా స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దించి ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ భారతి హోళి కేరి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా.. ప్రత్యేక పరిశీలకుడిగా తమిళనాడు క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అటు అధికారులు పార్టీల ఖర్చుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ లతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ లు పోటీలో ఉన్నారు. దాదాపు నెలరోజుల ప్రచారానికి ఆదివారమే తెరపడింది. పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే.. గత ఎన్నికల్లో 86 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అధికారులు పోలింగ్ శాతం మరింత పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి ఈవీఎంలు చేరాయి. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ స్టేషన్ లకు ఈవీఎంలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ ని సైతం సిద్ధం చేశారు.

నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 10న ఫలితాలు రానున్నాయి. దీంతో వారం రోజుల పాటు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories