సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడ.. మిత్రపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటానికి సన్నాహాలు

Strategical move by KCR
x

సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడ

Highlights

* తెలంగాణ భవన్ వేదికగా సమావేశం.. టీఆర్ఎస్‌ నుంచి బీఆర్ఎస్‌గా అవతరణ, బీఆర్ఎస్‌ తరఫున పార్టీ యంత్రాంగానికి దిశానిర్ధేశం

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో రేపు TRS విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముందుగా ప్రకటించిన భారత్ ‌రాష్ట్ర సమితిని జాతీయంగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించి నెలరోజులు గడుస్తున్ననేపథ్యంలో అధికారిక ధృవపత్రం తీసుకుని జాతీయ రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాథమికంగా టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం తీసుకోబోతున్నారు.

తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ ప్రతినిధులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కల్వకుంట్ల తారక రామారావు ఆహ్వానాలు పంపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఏం చర్చించనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై లోతైన విశ్లేషణ జరగనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఏవిధంగా పనిచేయాలి, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక అనుభవాలు, ఓటింగ్‌పై విశ్లేషించిన తర్వాత దానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో భాజపా తీరును ఎలా ఎండగట్టాలి, కాంగ్రెస్‌ పార్టీ పట్ల వైఖరి ఎలా ఉండాలనే దానిపై చర్చ జరిగే అవకాశముంది. ప్రదాని మోదీతో పాటు, భాజపా నేతలంతా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరపనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేదానిపై కూడా చర్చ జరిగే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories