కరోనా కష్టంలో అలుపెరుగని సేవా తపస్వి!

కరోనా కష్టంలో అలుపెరుగని సేవా తపస్వి!
x
Highlights

కరోనా పేరు వింటేనే గడగడలాడుతున్న పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి పని చేస్తున్నారు. అలా...

కరోనా పేరు వింటేనే గడగడలాడుతున్న పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి పని చేస్తున్నారు. అలా ముందుకు వచ్చిన వారు కుటుంబానికి దూరంగా, భర్త వద్దన్నా కాలనీ వాసులు వ్యతిరేకించినా, బాధలను భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లోని కోవిడ్-19 పాజిటివ్ కేసులను ఇంటి దగ్గర నుంచి టెస్టులు అనంతరం గాంధీకి తరలించి వారి బాగోగులు చూసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలిచిన మహిళ ఉద్యోగిపై స్పెషల్ స్టోరీ.

కరోనా కట్టడికి ప్రపంచం మొత్తం పోరాడుతుంది. మన దేశంలో కోవిడ్-19ను అదుపు చేయడానికి లాక్‌డౌన్‌ను విధించారు. పాజిటివ్ కేసులను ట్రీట్ చేయడానికి ప్రతి జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వారికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారిని దేశం మొత్తం కొనియాడుతోంది. కానీ ఎలాంటి పేరు ప్రతిష్టలు రాకున్నా వరంగల్ అర్బన్‌లో ప్రతి పాజిటివ్ కేసును ఇంటి దగ్గర నుండి108 వాహనంలో తీసుకొని వచ్చి, వారికి టెస్టులు చేసిన తరువాత పాజిటివ్ వస్తే గాంధీకి తరలించే సాహసం చేసిన ఒక మహిళ అందరి మనసులు గెలుచుకుంటుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన చైతన్య సుమారు 200 మంది సస్పెక్టెడ్ కేసులను ఇంటి వద్ద నుండి ఎంజీఎం ఆస్పత్రికి తరలించింది. పాజిటివ్ వచ్చిన 27 మందిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించి వారికి పునర్జన్మ అందించింది. అయితే చైతన్య మాత్రం తన కుటుంబానికి, పిల్లలకు గత 40 రోజులుగా దూరంగా ఉంటున్నారు. తోటి వారి సహకారం లేకున్నా. ఇంట్లో భర్త వద్దన్నా అందరిని ఒప్పించి ఈ విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంది. మొక్కవోని ధైర్యంతో సేవ చేస్తున్న ఓరుగల్లు చైతన్య కృషిని ప్రశంసిస్తున్నారు.

కరోనా నివారణ సేవలో ఉండటం తన అదృష్టమని తాను తన పిల్లల్ని చూడక 40 రోజులు దాటిందని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో పని చేయడం అవసరమని వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నానన్నారు చైతన్య. తన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడుల్లా బాధ అయ్యేదని కానీ కుటుంబ సభ్యులు అందరు వెన్నంటే ఉండి ప్రోత్సాహిస్తున్నారంటున్నారు చైతన్య శ్యామ్. తల్లిని చూడక 40 రోజులు దాటిందన్న చైతన్య పిల్లలు అమ్మను విడిచి ఎప్పుడు ఉండలేదన్నారు. రోజు వీడియో కాల్ చేస్తుందని ఎప్పుడు మాట్లాడిన రెండు, మూడు రోజుల్లో వస్తానని నచ్చచెబుతోందని పిల్లలు వాపోయారు. అమ్మను చూడకుండా ఉండలేకపోతున్నాం అంటున్నారు చైతన్య పిల్లలు.

కోవిడ్-19పై చైతన్య చేస్తున్న యుద్దానికి గర్వపడుతున్నామన్నారు కాలనీవాసులు. మొదట భయాందోళనకు గురయ్యామని తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు గర్వంగా ఫీలు అవుతున్నామంటున్నారు కాలనీ వాసులు. కంటికి కనిపించని వైరస్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కోవిడ్-19 కేసులను ట్రీట్ చేయడంలో ఒక మహిళగా 108 ఉద్యోగిగా అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది ఓరుగల్లుకు చెందిన చైతన్య. ఓరుగల్లు వాసుల మన్ననలే కాదు పూల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories