Srilatha Reddy: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు హుజూర్‌నగర్‌ను రాసి ఇచ్చారా?

Srilatha Reddy Comments On Congress And BRS
x

Srilatha Reddy: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు హుజూర్‌నగర్‌ను రాసి ఇచ్చారా?

Highlights

Srilatha Reddy: బీజేపీకి అవకాశం ఇచ్చి.. మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి

Srilatha Reddy: ఆడబిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు భయం పట్టుకుందన్నారు హుజూర్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి. గ్రామాల్లో అరాచకాలు, అవాంతరాలు సృష్టించిన వారి చిల్లర చేష్టలను లెక్కచేయకుండా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి గడప తట్టి ఓటు అభ్యర్థించానని శ్రీలతరెడ్డి తెలిపారు.

ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సైదిరెడ్డిలు సిండికేట్ రాజకీయం నడుపుతూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఏమైనా రాసి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యేగా మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి అని శ్రీలతరెడ్డి ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories