శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్​​లో అడుగంటిన జలాలు.. అన్నదాతకు తప్పని తిప్పలు

Sri Ram Sagar Project Water Levels Dead Storage
x

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్​​లో అడుగంటిన జలాలు.. అన్నదాతకు తప్పని తిప్పలు

Highlights

Sri Ram Sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టు నిజామాబాద్ జిల్లాలోని లక్షల కుటుంబాలకు వరప్రదాయినిగా పేరొందింది.

Sri Ram Sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టు నిజామాబాద్ జిల్లాలోని లక్షల కుటుంబాలకు వరప్రదాయినిగా పేరొందింది. గతేడాది నిండుకుండాల ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఈసారి నీటి మట్టం పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది. ఎండాకాలంలో వేడి కారణంగా జలాశయం వేగంగా ఆవిరైంది. ప్రాజెక్ట్ భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో సాగు నీటికి తాగు నీటికి గండం ఏర్పడింది. ఓవైపు వర్షాకాలం మొదలు కానుండటంతో ఇప్పటికే సాగు ప్రారంభించాలి కానీ నీరు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు‌కు 1963 జూలై 26న ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టు అని శంకుస్థాపన చేశారు. 1970 జూలై 24న అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 112 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు 1978లో చెన్నారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చారు. 1978లో ప్రాజెక్టు పూర్తి చేయగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించి కాల్వల ద్వారా నీరు విడుదల చేశారు. మొదట సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేయగా 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ శ్రీరామసాగర్ ప్రాజెక్టు దగ్గర విద్యుత్‌ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సాగు, తాగు నీటిని అందించడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.

శ్రీరాంసాగర్ స్టేజీ-వన్ కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9 లక్షల 68 వేల 640 ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పుడే నిర్ణయించారు. అలాగే, శ్రీరాంసాగర్ స్టేజీ-టూ కింద 3 లక్షల 97 వేల 949 ఎకరాలకు నీరందించే విధంగా.. ప్రణాళికలు చేశారు. స్టేజీ 1,2 కింద మొత్తం 13 లక్షల 55 వేల 589 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అప్పడే ప్లాన్ వేశారు. శ్రీరాంసాగర్ ఎగువన ఉన్న గోదావరిపై పలు ప్రాజెక్టులు కట్టడం, వర్షాభావ పరిస్థితులు, గత సమైక్య ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తెచ్చాయి. కాకతీయ కెనాల్, లక్ష్మి కెనాల్ , సరస్వతి కెనాళ్ల ద్వారా నిజామాబాద్ నుంచి ఖమ్మం దాక జీవనాడిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విస్తరించింది. కానీ.. అనుకున్నంత స్థాయిలో నీటి సరఫరాలో వెనుకబడింది.

మొన్నటి వరకూ రాష్ట్రంలో ఎండలు కుప్పుల వర్షం కురవడంతో.. ప్రాజెక్ట్‌లలో నీటిమట్టాలు అడుగంటాయి. గత సీజన్‌లో SRSP నుంచి 600 TMCల‌ నీళ్ల‌ను గోద‌వరిలోకి వ‌దలగా, ఇప్పుడు కనీసం సాగుకు కూడ నీరందివ్వ‌ని దీనస్థితికి చేరింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి SRSP ఇన్‌ఫ్లో రానీ కారణంగా, ప్రస్తుతం కేవలం 10 టీఎంసీలలోపే నిల్వ సామర్థ్యం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుండి చుక్క బొట్టు రాకపోవడం వల్ల డెడ్ స్టోరేజికి చేరుకుంటోంది. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో పాటు ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురవకపోవడంతో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి 91 అడుగులు కాగా.. ప్రస్తుతం వెయ్యి 56 అడుగులకు చేరింది. ప్రాజెక్టు అధికారులు, ఆయకట్టు రైతులు, మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు అడుగడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వర్షాల ద్వారా కూడిన పూడిక ఒకేత్తైతే... రైతులు సాగు కోసం చేసుకున్న క్లీనింగ్‌లో భాగంగా దుంగలు.. కెనాల్‌లో వేయటంతో.. మరింత పూడిక జరుగుతోందని ఇంజనీరింగ్ అధికారులు వాపోతున్నారు. వాటిని తొలగించే అధికారం తమ పరిధిలో లేదని చెబుతున్నారు. ప్రభుత్వం కొంత ఎస్టేమేషన్‌ సాక్షన్ చేస్తే.. కొంత వరకూ కేనాల్ పూడికలు తీసేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.

శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ఇటీవలి కాలంలో భారీగా వరద వచ్చిన కారణంగా పూడిక మరింత పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో పూడక బాగా పెరగటంతో ఉత్తర తెలంగాణలో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతుల వాపోతున్నారు. ఏటా ప్రాజక్ట్ సామార్థ్యం తగ్గి పోతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు.

ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 10.2 టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయని.. వీటిలో తాగునీటికి 2 టీఎంసీలు సరిపోతయాన్ని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఈనెలలో ప్రారంభమవుతే జులై నాటికి పూర్తి స్థాయిలో నీటినిల్వలు ఉంటాయని అధికారులు అంటున్నారు. అదే జరిగితే రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగేళ్లుగా భారీగా వరద పోటెత్తుతోంది. భారీ వరద కారణంగా కొట్టుకొచ్చే పూడికతో గేట్లు రిపేరవుతున్నాయి. గేట్ల మరమ్మతుల కోసం సుమారు రూ.17కోట్ల నిధులను మంజూరు కాగా, ప్రస్తుతం 32 గేట్ల మరమ్మత్తులు పూర్తి కాగా, మిగిలిన గేట్లకు మమ్మతులు చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణకు జీవనాధారం అయిన SRSP ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. వర్షాలు అలస్యం అయిన ఉత్తర తెలంగాణలో సాగు, తాగు నీటికి కష్టాలు మాత్రం తప్పవని భావిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నిరు వస్తే, ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని అటు అధికారులు.. ఇటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories