Secunderabad: గో మహాపాదయాత్రను ప్రారంభించిన శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి

Sri Datta Vijayananda Tirtha Swamy Who Started The Cow Mahapadayatra
x

Secunderabad: గో మహాపాదయాత్రను ప్రారంభించిన శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి 

Highlights

Secunderabad: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి -శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి

Secunderabad: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోదారిత ఉత్పత్తుల వినియోగం వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి అన్నారు. అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహా పాదయాత్రను ప్రారంభించారు. ఆవును రక్షించు భూమిని కాపాడు అనే నినాదంతో పెద్ద ఎత్తున మహా పాదయాత్ర శ్రీకారం చుట్టారు. 25 రోజులపాటు 780 కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పవిత్రతను కాపాడాలని అఖిలభారత గో సేవ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణ గురుస్వామి అన్నారు. సర్వ మత గ్రంథాలు జీవ హింస చేయరాదని ఉన్నప్పటికీ గోవధ చేస్తుండడం భాదాకరమని.. గోవధ నిర్మూలనకై కృషి చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories