తెలంగాణ కాంగ్రెస్ లో వలసల భయం

Special Story on Telangana Congress Party
x

తెలంగాణ కాంగ్రెస్ లో వలసల భయం

Highlights

Congress: తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నేతలు వలస బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Congress: తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నేతలు వలస బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేతల మనసు మారడానికి కేసీఆర్ ఎన్నికల వ్యూహం ఒక కారణమైతే.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అధిష్టానం దృష్టిలో పడాలన్నది మరో కారణంగా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా కాంగ్రెస్ నేతలపై పడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అన్నింటికి మించి తెలంగాణలో ఎన్నికల ఖర్చు మోయలేని భారంగా మారడమే..తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిక్కెట్ కోసం నేతలు క్యూ కడుతుంటారు.. టికెట్ దొరకడమే అదృష్టంగా భావించి ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతారు. అలాంటిది ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్న నాయకులు కూడా పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ఖరీదుగా మారిపోయాయని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 50 లక్షల నుంచి 2కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యేది. నేడు 50 కోట్ల దాకా ఖర్చవుతున్నట్లు సమాచారం. గతంలో పైసా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయ్యానని ఓ మాజీ పిసిసి చీఫ్ చొప్పుకొచ్చారు. ఇటీవలి పంజాబ్ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కోటిన్నర రూపాయల లోపే ఖర్చయ్యిందని సదరు నేత గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికల ఖర్చు భారీగా పెరగడంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు గెలిచే అవకాశాలు ఉన్న నేతలు సైతం పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేకపోవడంతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గా గెలిచిన ప్రయోజనం లేదనే ఆలోచనలో ఉన్నారట. దీంతో కొంతమంది కీలక నేతలు ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో కి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట. ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో కి వెళ్తే అదిష్టానం దృష్టిలోపడొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి తరువాత ఎంపీగా మల్కాజిగిరి నుండి గెలిచి జాతీయ రాజకీయాలకు వెళ్లారు. దీంతో అదిష్టానం దృష్టిలో పడిన రేవంత్ రెడ్డి ని ఎందరు వ్యతిరేకించిన సోనియా గాంధీ పీసీసీ చీఫ్ గా చేసింది. దీంతో తెలంగాణ లో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు కష్టంగానే మారేలా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories