Hyderabad: కబ్జాదారుల కోరల్లో మూసీనది..మోక్షం ఎప్పటికో!

Hyderabad: కబ్జాదారుల కోరల్లో మూసీనది..మోక్షం ఎప్పటికో!
x

హైదరాబాద్ లోని మూసి నది 

Highlights

Hyderabad: నిర్లక్ష్య ధోరణిలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు..గండిపేట, హిమాయత్‌సాగర్‌లు నిండితే మూసీ మీదుగా ప్రవాహం

Hyderabad: ఒకప్పుడు నగరవాసుల దాహార్తిని తీర్చిన మూసీనది నేడు మురికికూపంగా మారి, కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని కనుమరుగవుతోంది. ఇప్పటికే నది పరీవాహక ప్రాంతాలను సుందరీకరణ దిశగా అడుగులు వేస్తున్న పూర్తి దశకు చేరకుండా ఆక్రమణలు అడ్డుపడుతున్నాయి. మూసీని పరిరక్షించాల్సిన జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మిగిలిన స్థలాలు కూడా కబ్జా అవుతున్నాయి. మూసీనది ఆక్రమణలపై హెచ్ఎంటీవి స్పెషల్ ఫోకస్.

మూసీనది నగరానికి ఒక మనిహారం. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌లు నిండితే మూసీ, ఈసీ నదుల నుంచి వచ్చే నీరంతా హైదరాబాద్‌ మహానగరం మీదుగా 42 కి.మీ మేర పారుతూ ఉంటుంది. అలాంటి మూసీ నది ప్రస్తుత పరిస్ధితి ప్రశ్నార్ధకం అవుతుంది. కోట్లు వెచ్చించి మూసీ నదిని ప్రభుత్వం సుందరీకరిస్తుండగా.. మరోవైపు ఆక్రమణలపర్వం కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నదినే కబ్జాకోరులు పూడ్చివేస్తున్నారు.

ఇప్పటికే ఆక్రమణలతో మూసీ చాలాచోట్ల స్వరూపం కోల్పోయింది. బస్తీలు, కాలనీలు రావడంతోపాటు పెద్ద భవంతులు వెలిసాయి. వాటిని తొలగించేందుకు అధికారులు సాహసించడం లేదు. కానీ, ఇదే సమయంలో కొత్తగా వచ్చే ఆక్రమణలను నిరోధించే విషయంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.

ఇలా ఆక్రమణల కారణంగా గత ఎడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసి నుండి వెల్లాల్సిన నీరు కు అక్రమణలు అడ్డు కావడంతో ఇళ్ళల్లోకి వచ్చి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ మళ్లీ అలా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మూసీ పరివాహక ప్రాంతవాసులు కోరుతున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మూసీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. బాపూఘాట్‌ నుంచి నాగోలు వరకు సుందరీకరణ పనులు చేపట్టింది. ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మించేందుకు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ పూనుకుంది. అయినా ఆక్రమణలు జోరుగా కొనసాగుతుండటం విశేషం.

అత్తాపూర్‌ నుంచి నాగోలు వరకు ఎక్కడికక్కడ కొత్తగా ఆక్రమణలు వెలుస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే మార్గంలోని మూసీ నది చుట్టుపక్కల కొన్నేళ్ల కిందటే చిరు వ్యాపారులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి ఏకంగా నదిలో ఎకరా స్థలంలో మట్టి పోసి చదును చేసి పార్కింగ్‌ ప్రదేశంగా వాడుకుంటున్నాడు.

మూసీ నదికి హద్దులు గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రాత్రికిరాత్రే నిర్మాణ వ్యర్థాలు తెచ్చి నదిలో డంప్‌ చేస్తున్నారు. ఆ తర్వాత చదును చేసి షెడ్లు నిర్మించడం లేదా పార్కింగ్‌ ప్రదేశాలుగా వినియోగించడం చేస్తున్నారు. వాస్తవానికి గతేడాది అక్టోబరులో వచ్చిన వరదల సమయంలో ఆయా ప్రదేశాలు పూర్తిగా నీటమునిగాయి. అయినప్పటికీ తమకెం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.

చాదర్‌ఘాట్‌లో పాత, కొత్త వంతెనల మధ్య మట్టి పోసి చదునుచేస్తున్నారు. ఇక్కడ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నదినే చదును చేసి మొక్కలు నాటితే ప్రయోజనమేమిటని విమర్శిస్తున్నారు ప్రజలు. ఇలాంటి అక్రమణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories