కళ తప్పిన దీపావళి

కళ తప్పిన దీపావళి
x
Highlights

సంవత్సరం మొత్తం చేసే బిజినెస్ .. ఒక్క పండగతో సమానం. పెట్టుబడులు ఎంత పెట్టినా రాబడికి లోటుండదు.. రాదన్న దిగులుండదు. చిన్న వ్యాపారాల నుండి అతి పెద్ద వ్యాపారాల వరకూ లాభాల పంటను పండించుకుంటాయి.

లాభం మాట దేవుడెరుగు.. ఈసారి అంతా నష్టమే. ప్రతి రంగంపైనా పడ్డ కరోనా ప్రభావం ఇప్పటికీ తొలగి పోలేదు. ఎప్పటికి తొలగి పోతుందో తెలియదు. జీవితాలు కుదుట పడలేదు.. కోలుకోలేదు. కొనుగోలు శక్తిని కోల్పోయిన సామాన్యులు పండగలకూ దూరమవుతున్నారు. వారి జీవితాలే కాదు.. ఇప్పుడు పండగలూ కళ తప్పుతున్నాయి.

వెలుగు దివ్వెల పండగొచ్చింది. కానీ .. కాంతి లేదు. చెవులు దిబ్బిళ్ళు పడే పండగొచ్చింది. కానీ.. సందడి లేదు. జీవితాలపై కమ్మిన కరోనా చీకట్లు ఇంకా తొలగి పోనేలేదు. ఎక్కడ చూసినా నైరాశ్యం.. దైన్యం.. ఆర్ధిక మాంద్యం. మొన్న వినాయక చవితి .. నిన్న విజయదశమి .. ఇప్పుడు దీపావళి. వరుసగా పండగలొస్తున్నాయి. పోతున్నాయి. కానీ .. పరిస్ధితి మాత్రం మారడం లేదు. వ్యాపారాలు సాగడం లేదు. జీవితాలు మారడం లేదు. వెలుగులు నిండడం లేదు. దీంతో దీపావళి కూడా వెలాతెలగానే మారింది.

సంవత్సరం మొత్తం చేసే బిజినెస్ .. ఒక్క పండగతో సమానం. పెట్టుబడులు ఎంత పెట్టినా రాబడికి లోటుండదు.. రాదన్న దిగులుండదు. చిన్న వ్యాపారాల నుండి అతి పెద్ద వ్యాపారాల వరకూ లాభాల పంటను పండించుకుంటాయి. దసరా.. దీపావళి.. సంక్రాంతి సీజన్ లో అయితే ఇక చెప్పక్కరలేదు. అయితే ఈసారి అంత సీన్ కనిపించడం లేదు. బంగారం దుకాణాలు మినహాయించి మిగతా వ్యాపారాలన్నీ మూలన పడ్డాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్ధితి లేకుండా పోయింది.

ధన త్రయోదశి అంటేనే ఓ సెంటిమెంట్. ఆ రోజున ఓ వీసమెత్తు బంగారమన్నా కొనుక్కోవాల్సిందే. ఎన్నో ఏళ్ళుగా అలాంటి సెంటిమెంట్ ను పాటిస్తున్న వారు ఎందరో. ఇప్పుడు కూడా. ఇలాంటి సమయంలోనూ. ఇంతకు ముందు తులం కొనుక్కునే వారు .. ఇప్పుడు కేవలం ఓ గ్రాముతోనే సంతోషపడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories