TGSRTC: సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా? అయితే మీ తెలంగాణ ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్

TGSRTC: సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా? అయితే మీ తెలంగాణ ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్
x
Highlights

TGSRTC: ఈ సంవత్సరం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి 2400 ప్రత్యేక బస్సులు నెడుతున్నట్లు ఏపీఆర్టీసీ తెలిపిన వెంటనే తెలంగాణ ఆర్టీసీ కూడా దీనిపై స్పందించింది....

TGSRTC: ఈ సంవత్సరం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి 2400 ప్రత్యేక బస్సులు నెడుతున్నట్లు ఏపీఆర్టీసీ తెలిపిన వెంటనే తెలంగాణ ఆర్టీసీ కూడా దీనిపై స్పందించింది. తాము ఏకంగా 5వేల ప్రత్యేక బస్సులను నడపబోతున్నట్లు తెలిపింది. సంక్రాంతి పండగను ఎక్కువగా జరుపుకునేది ఏపీలోనే. ఏపీకంటే తెలంగాణ ఆర్టీసీ ఎక్కువగా బస్సులు వేస్తూ ఫెస్టివల్ రష్ ను బాగా క్యాష్ చేసుకుంటోంది.

సాధారణంగా పండగకు ఊరువెళ్లేటప్పుడు ప్రైవేట్ ట్రావెలర్స్ భారీగా ఛార్జీలు పెంచుతుంటారు. తెలంగాణ ఆర్టీసీ మాత్రం అదనపు ఛార్జీలు ఏవి ఉండవని స్పష్టం చేసింది. అయితే 5వేల బస్సులను ఎప్పుడూ కూడా నడపలేదు. ఈసారి భారీ సంఖ్యలో బస్సులను నడుపుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ వైపు ప్రయాణికులు చూడకూడదని అనుకున్నారేమో తెలంగాణ ఆర్టీసీ అధికారులు. అందుకే ఈసారి ఎక్కువగా బస్సులను కేటాయించారు.

అయితే ఈ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం అధికారులు ఇంకా తెలియజేయలేదు. అయితే జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటి టైమింగ్స్, ఏయే మార్గాల్లో ఎన్ని బస్సులు వెళ్తాయి వంటి వివరాలను త్వరలోనే తెలపనుంది తెలంగాణ ఆర్టీసీ.

ఇవి ప్రత్యేక బస్సులు కావడంతో తెలంగాణలో మహిళలకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుంది. వారంతా ఫ్రీగా జర్నీ చేయవచ్చు. తెలంగాణవారు ఏపీ వెళ్తుంటే మాత్రం సరిహద్దు వరకు ఫ్రీ ..అక్కడి నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories