Dalita Bandhu: దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు

Special Application to Apply Dalita Bandhu Scheme
x
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Dalita Bandhu: దళిత బంధు పథకం దరఖాస్తుకు ప్రత్యేక యాప్ *సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థకు యాప్‌ డెవలప్మెంట్ బాధ్యతలు

Dalita Bandhu: ఎస్సీల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేయనుంది. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధంచేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది. ఈ పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 26న దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు విధివిధానాలు వెలువడే అవకాశముంది.


Show Full Article
Print Article
Next Story
More Stories