Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం ఫేమ్‌ కొమురమ్మకు ఆర్ధిక సహాయం

Speaker Donates Rs One Lakh Financial Assistance To Balagam Movie Fame Komuramma
x

Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం ఫేమ్‌ కొమురమ్మకు ఆర్ధిక సహాయం

Highlights

Gaddam Prasad: బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అందజేశారు.

Gaddam Prasad: బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అందజేశారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్‌కుమార్‌ ఆ అవార్డు గ్రహీతలైన కొమురమ్మ, మొగిలయ్యల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి ఆర్థికసాయం చేస్తానని మాటిచ్చారు.

కొమురమ్మ, మొగిలయ్యల ఆర్ధిక పరిస్థితికి చలించి తన నెల జీతం నుండి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్రతో కలిసి కొమురమ్మకు లక్ష రూపాయల చెక్కును అందజేశాడు. ఈ సందర్భంగా తనకు పెన్షన్‌ ఇప్పించాలని స్పీకర్‌కు కొమురమ్మ విజ్ఞప్తి చేశారు. మంత్రి జూపల్లితో మాట్లాడి పెన్షన్‌ ఇప్పించేందుకు కృషి చేస్తానని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories