Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

South Central Railway Arranges 26 Special Trains For Ayyappa Devotees
x

Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

Highlights

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు 26 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది.

శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయంతో పాటుగా కొచ్చి వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

కాచిగూడ-కొట్టాయం రైలు(07131/07132)-నవంబర్ 17, 24 తేదీల్లో కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఇది మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అవే స్టేషన్ల మీదుగా కాచిగూడకు చేరుతుంది.

కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ(07133/07134) నవంబర్ 18, 25 తేదీల్లో సోమవారం రాత్రి 8.50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొట్టాయం చేరుతుంది. కాచిగూడ నుంచి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పేట, సేలం, ఈ రోడ్, తిరుప్పూర్, పోడనూర్, కోయంబత్తూరు, పాలక్కాడ, త్రిస్సూర్, అలవా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది.

హైదరాబాద్-కొట్టాయం-హైదరాబాద్(07135/07136) ఈ నెల 19, 26 తేదీలలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

సికింద్రాబాద్-కొట్టాయం-సికింద్రాబాద్ (07137/07138) నవంబర్ 16, 23, 30వ తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 9.45 గంటలకు కొట్టాయంలో బయల్దేరి సోమవారం రాత్రి 12.50కు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్‌లో ఈ రైలు నవంబర్ 22, 29 తేదీల్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈ రోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది.

నాందేడ్-కొల్లం-సికింద్రాబాద్(07139/07140) నవంబర్ 16న నాందేడ్‌లో నవంబర్ 18న కొట్టాయంలో బయలుదేరుతుంది. ఈ రైలు ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాంగూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

మౌలాలి-కొల్లాం-మౌలాలి(07141/07142) ఈ నెల 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 2.45 గంటలకు మౌలాలీలో బయలుదేరుతుంది. కొల్లాంలో నవంబర్ 25న బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈ రోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories