Vikarabad: కన్నతండ్రిని అడవిలో వదిలి వెళ్లిన కొడుకులు

Sons Left Their Father in the Forest in Vikarabad District
x

Vikarabad: కన్నతండ్రిని అడవిలో వదిలి వెళ్లిన కొడుకులు

Highlights

Vikarabad: వృద్ధప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకులు కర్కశంగా ప్రవర్తించారు.

Vikarabad: వృద్ధప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకులు కర్కశంగా ప్రవర్తించారు. తమను కని పెంచి పెద్ద చేసిన తండ్రిని అడవిలో వదిలేసి కొడుకు అనే పదానికి కళంకం తెచ్చారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన గొల్ల పరమేష్, రామకృష్ణ అనే ఇద్దరు తన తండ్రి గొల్ల స్వాములు ను బైక్‌ మీద తీసుకొచ్చి అనంతగిరి అడవిలో వదిలేసి వెళ్లారు.

ఎటు పోవాలో తెలియక సాములు అక్కడి నుంచి వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఆకలితో అలమటిస్తూ దిగులుగా ఉండడంతో హోటల్ యజమాని చేరదీసాడు. స్వాములును వివరాలు అడిగి తెలుసుకుని హోటల్ యజమాని అన్నం పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. తమ కొడుకులకు తన పొలం అమ్మి చేరి సమానం పంచానని ఇప్పుడు తననే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు స్వాములు. పోలీసులు స్వాములు నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం అతణ్ని వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని మహిత మినిస్ట్రీస్‌ అనాథాశ్రమానికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories