సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
x
Highlights

అనారోగ్య సమస్యతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది.

అనారోగ్య సమస్యతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే హైదరాదాబ్ నగరంలోని చందానగర్‌లో నివాసముంటున్న రఘురాం(35), ఆయన భార్య శ్రీదేవి గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటినుంచి బయటకు వెళ్ళిన రఘురాం కంపెనీ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యే రఘురాం ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories