అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పిల్లలు మృతి

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పిల్లలు మృతి
x
Highlights

కాంచన్‌బాగ్‌లో ఆదివారం 15 ఏళ్ల బాలిక, ఆమె సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

కాంచన్‌బాగ్‌లో ఆదివారం 15 ఏళ్ల బాలిక, ఆమె సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుని తండ్రి అబ్దుల్ రహీమ్ రాత్రి తన ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అజీజ్ నోటి నుండి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించాడు.

రహీమ్ భార్య ఫర్హాత్ బేగంను పిలిచి అడగగా తన ఆరోగ్యం బాగా లేనందువల్ల తమ పిల్లలను అపస్మారక స్తితిలో పడివుండడం గమనించలేదని తెలిపింది. దీంతో రహీమ్ తన పిల్లలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. పిల్లల్ని పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం పిల్లల శావాలకి శవపరీక్ష నిర్వహించి వారి కుటుంబానికి అప్పగించినట్లు పోలీసులకు సమాచారం అందింది. పిల్లలు చనిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు రహీమ్ ఇంటిని పరిశీలించారు. ఫుడ్ పాయిజనై చనిపోయివుంటారన్న అనుమానంతో వారి ఇంట్లోని కొన్ని పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు కొన్ని మందుల సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories