Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో రికార్డు

Single Dose Vaccination is Near to 1 Crore in Telangana
x

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఫోటో)

Highlights

Covid Vaccination: కోటికి చేరువైన సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ * 5 నెలల 18 రోజుల్లోనే కోటి మందికి ఫస్ట్‌ డోస్‌

Covid Vaccination: తెలంగాణలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోటికి చేరువైంది. టీకా పంపిణీ ప్రారంభమైన 5 నెలల 18 రోజుల్లోనే సుమారుగా కోటి మందికి సింగిల్‌ డోస్‌ టీకా ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 18ఏళ్లు పైబడినవారు.. 2కోట్ల 64లక్షల 64వేల 870 మంది ఉండగా.. వారిలో 31.14 శాతం మందికి ఫస్ట్‌ డోస్‌, 6.43 శాతం మందికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 82.22 శాతం మందికి, అత్యల్పంగా నారాయణపేట్‌ జిల్లాలో 11.9 శాతం మందికి టీకా పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో కోటి 65 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సినవారు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories