Singareni Elections: సింగరేణి ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయ పార్టీల్లో అలజడి

Singareni Elections Have A Chance To Influence The General Elections
x

Singareni Elections: సింగరేణి ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయ పార్టీల్లో అలజడి

Highlights

Singareni Elections: 2017లో చివరిసారి జరిగిన సింగరేణి ఎన్నికలు

Singareni Elections: సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగింది. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర కార్మిక శాఖ సింగరేణి సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.

అయితే సింగరేణి సంఘం గుర్తింపు ఎన్నికలు చివరిసారిగా 2017లో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ప్రతి రెండేళ్లకి జరగాల్సిన ఎన్నికలు ఆరేళ్లుగా జరగకపోవడంతో ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది హైకోర్టు. అక్టోబర్‌లో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు సింగరేణి ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయ పార్టీలో అలజడి స్టార్ట్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఈ సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదంటున్నారు.

ఇక సింగరేణి ఎన్నికల్లో తమ ప్రభావం చూపడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లీడ్ ఇచ్చారు కోల్ బెల్ట్ ఓటర్లు. కార్మిక సంఘం గెలుపు కోసం అధికార బీఆర్ఎస్‌ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇటు కమ్యూనిస్టు సంఘాలు కూడా సింగరేణిలో బలపడ్డాయి. అయితే సింగరేణి ఎన్నికల ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే ఛాన్స్ ఉండడంతో.. ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories