Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Singareni Elections 2023 Polling Begins
x

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Highlights

Singareni Elections: పోటీ పడుతున్న 13సంఘాలు

Singareni Elections: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నిక రోజునే ఫలితాలు కూడా వెల్లడిస్తారు అధికారులు. గుర్తింపు సంఘంగా గెలిచేందుకు మొత్తం 13 సంఘాలు సింగరేణిలో పోటీ పడుతున్నాయి. సింగరేణి ఎన్నికల కోసం మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 11 రీజియన్ లలో 39 వేల 748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తరువాత వెంటనే బ్యాలెట్ బాక్స్ లని భద్రత నడుమ కౌంటింగ్ సెంటర్లకి తరలిస్తారు. సింగరేణి మొత్తంలో 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కావడంతో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories