Chada Venkat Reddy: ఒకే దేశం..ఒకే పన్ను.. ఒకే ఎలక్షన్ అని మోదీ చెప్పారు

Simultaneous Elections Are Not Possible In The Country Says Chada Venkat Reddy
x

Chada Venkat Reddy: ఒకే దేశం..ఒకే పన్ను.. ఒకే ఎలక్షన్ అని మోదీ చెప్పారు

Highlights

Chada Venkat Reddy: పెట్రోల్‌పై మాత్రం జీఎస్టీని అమలు చేస్తున్నారు

Chada Venkat Reddy: దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యంకాని అంశమన్నారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి. జమిలి ఎన్నికల విధానం దేశంలో ఉన్న పాతవిధానమే అని అన్నారు. అయితే ప్రధాని మోదీ కమిటీ వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎలక్షన్ అని చెప్పిన మోదీ, పెట్రోల్ ఉత్పత్తులను మాత్రం పక్కదారి పట్టిస్తూ జీఎస్టీని అమలు చేయడమేంటని విమర్శించారు. దేశంలో 28 పార్టీలు బీజేపీ హటావో దేశ్ కీ బచావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పొత్తులపై కూడా స్పందించారు. గతంలో కేసీఆర్‌కు చెప్పిందే కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పామన్నారు. పొత్తులో భాగంగా తాము డిమాండ్ చేసిన ఐదు సీట్లు ఇవ్వకుంటే, బలంగా ఉన్న 33 నియోజకవర్గాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులను పోటీలోకి దింపుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories