Viral Video: మఫ్టిలో అడిషనల్ ఎస్పీ.. పోలీసులకు షాకిస్తూ లాక్‌డౌన్‌ పరిశీలన

Siddipet Additional SP In Mufti Dress During Telangana Lockdown Time
x

మారువేషంలో ఉన్న అడిషనల్ ఎస్పీని తనిఖీ చేస్తున్న పోలీసు (ఫొటో ట్విట్టర్)

Highlights

Additional SP as Common Man: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు రెండు వారాలుగా లాక్‌డౌన్ అమలు చేస్తేన్న సంగతి తెలిసిందే.

Siddipet Additional SP in Mufti Dress: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు రెండు వారాలుగా లాక్‌డౌన్ అమలు చేస్తేన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది అవసరం లేకున్నా..చిన్నచిన్న కారణాలతో బయట తిరుగుతున్నారు. అయితే కొన్ని చోట్ల పోలీసులు సున్నితంగా చెప్పినా.. మరికొన్ని చోట్ల తమ లాఠీలకు పనిచెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ రామేశ్వర్‌... క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్ ఎలా జరుగుతుందో స్వయంగా వెళ్లి పరిశీలించాలనుకున్నాడు. అధికారిగా వెళ్తే..కష్టమని.. మారువేషంలో వెళ్లి.. తమ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు.

ఈ నేపథ్యంలో మారు వేషం ధరించి, పాత బైక్ పై ప్రతి చెక్ పోస్ట్ వద్ద ఓ కారణం చెప్పుకుంటూ చెక్ పోస్ట్ లు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. తలకు రుమాలు, పాత బైకుపై సిద్దిపేటలో దూసుకుంటూ వెళ్లాడు. దాదాపు 10 పోలీసు చెక్‌పోస్టులను ఇలా దాటేశాడు. 'ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావ్‌' అంటూ పోలీసులు అడగగా.. మెకానిక్‌నని ఓ చెక్‌పోస్టు వద్ద, మెడికల్‌ షాప్‌కి వెళ్తున్నానంటూ మరోచోట బదులిచ్చాడు. మరోచోట 'మంత్రి నాకు బాగా తెలుసు..కావాలంటే పీఏకి ఫోన్‌ చేసి మాట్లాడంటూ ఓ చోట తెలివిగా సమాధానం చెప్పాడు.

కానీ, పోలీసులు ముందుకు వెళ్లేందుకు నిరాకరించారు. అలాగే ఓ చోట 'జ్వరం టాబ్లెట్లు తెచ్చుకోనివ్వరా' అని ప్రశ్నిస్తే.. ఎస్‌ఐ స్థాయి అధికారి గద్దించాడు. ఇలా ఆపిన చెక్ పోస్టుల వద్ద ఏదో ఒక స్టోరీ చెప్పి ముందుకెళ్లాడు. ఓ చోట మాత్రం ఓ సీనియర్ అధికారి... ఈయనను ముందుకు వెళ్లనిచ్చేది లేదని గట్టిగా చెప్పేశాడు. అవసరమైతే మా పోలీసులే టాబ్లెట్లు తీసుకు వస్తారన్నాని, ఇక్కడే నువ్వు వెయిట్ చేయాలిని చెప్పాడు.

తిరుగు ప్రయాణంలో ఆయనను చూసిన పోలీసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మొత్తానికి సిద్ధిపేటలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా జరుగుతుందని, పోలీసులు సక్రమంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories