Warangal: జెండా గద్దెను బూటుకాళ్లతో తొక్కుతూ జెండా ఎగరవేసిన ఎస్ఐ

SI Hoisted The Flag By Trampling The Flagpole With His Feet In Warangal
x

Warangal: జెండా గద్దెను బూటుకాళ్లతో తొక్కుతూ జెండా ఎగరవేసిన ఎస్సై

Highlights

Warangal: వరంగల్‌ రాయపర్తి పీఎస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘటన

Warangal: ఆయనో ఎస్ఐ..అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే క్రమశిక్షణ తప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా గద్దెను బూటుకాళ్లతో తొక్కుతూ జెండా ఎగరవేశాడు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన చోటుచేసుకుంది. రాయపర్తి పోలీస్ స్టేషన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎస్సై విజయ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జెండా గద్దెను బూటు కాళ్లతో తొక్కిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎస్సై విజయ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఎస్సై విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు, డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories