Coronavirus: డెటాల్‌ వాటర్‌లో డబ్బులు వాష్‌

Coronavirus: డెటాల్‌ వాటర్‌లో డబ్బులు వాష్‌
x
Highlights

Coronavirus: కరోనా విజృంభిస్తున్న వేళ ఎప్పుడు వినని విషయాలు వింటున్నాం. ఎప్పుడు చూడాని దృశ్యాలు చూస్తున్నాం. ముఖానికి మాస్కులు, ప్రతి...

Coronavirus: కరోనా విజృంభిస్తున్న వేళ ఎప్పుడు వినని విషయాలు వింటున్నాం. ఎప్పుడు చూడాని దృశ్యాలు చూస్తున్నాం. ముఖానికి మాస్కులు, ప్రతి వస్తువును శానిటైజ్‌ చేయడం కామన్‌ అయిపోయింది. అయితే ఓ వ్యక్తి తీసుకుంటున్న జాగ్రత్తలు కొందరికి ఆశ్యర్యంగా అనిపిస్తే కష్టమార్లకు మాత్రం భరోసాగా ఉంది. కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి గ్రామంలో ఓ వ్యాపారి కరోనా సోకకుండా తీసుకునే జాగ్రత్తలు కాస్త ఇంట్రెస్ట్‌గా అనిపిస్తోంది. తన సూపర్ మార్కెట్‌లోకి వచ్చిన వారు ఇచ్చే డబ్బును డెటాల్ నీళ్లల్లో వేసి కడుగుతున్నాడు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కష్టమార్లు మరింత నమ్మకంతో తన షాపుకు వస్తారని యజమాని చెబుతున్నాడు.

జిల్లా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో షాపుకు వచ్చిన వారు జాగ్రత్తలు చూసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షాపుకు వచ్చిన వారిని కూడా శానిటైజ్‌ చేస్తుండటంతో మార్కెట్‌కి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా క‌మ్యూనిటి స్ప్రేడ్ అవుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ ఇలాంటి ముందు జాగ్రత్తలు కాస్త దైర్యంగా ఉన్నాయని కష్టమార్లు చెబుతున్నారు. కష్టమార్ల సాటిస్ఫాక్షన్ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుందని యజమాని చెబుతున్నాడు. మొత్తంగా షాపు యజమాని తీసుకుంటున్న జాగ్రత్తలతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories