Siva Balakrishna: ఫలితంగా అరవింద్ పేరిట ఒక ప్లాట్‌ను బహుమానం చేసిన వర్టెక్స్ హోమ్స్
Siva Balakrishna: శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. తనకు చెందిన పలు బిల్డింగులకు బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నార్సింగిలోని ఓ కంపెనీకి చెందిన 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 కోట్లు డిమాండ్ చేయగా... సదరు సంస్థ కోటి రూపాయలు ఇచ్చింది.
డిసెంబర్‌లో అరవింద్ ఇంటికి వెళ్లి ఆ డబ్బును శివబాలకృష్ణ అందించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలను అరవింద్ డిమాండ్ చేశారని రిపోర్టులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మహేశ్వరం మండలం మంకల్ వద్ద వర్టెక్స్ భూములకు క్లియరెన్స్ ఇచ్చినందుకు అరవింద్‌కు ఓ ఫ్లాట్‌ను బహుమానం చేసిందిన రిపోర్టులో పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire