Vijay Bhaskar: రియల్టర్ విజయ్‌భాస్కర్ హత్య కేసులో షాకింగ్ నిజాలు

Vijay Bhaskar, Realtor, Death Cases, Telangana,
x

అనుమానం వచ్చి ఫోటో తీసిన కాటికాపరి (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijay Bhaskar: 5నెలల క్రితమే హత్యకు స్కెచ్ వేసినట్లు అనుమానం *విజయ్‌భాస్కర్‌ ఉంటున్న హాస్టల్‌లో కొడుకుని చేర్పించిన నిందితుడు

Vijay Bhaskar: రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణలో షాకింగ్‌ నిజాలు బయటపడుతున్నాయి. రియల్టర్‌ను చంపేందుకు 5నెలల క్రితమే.. స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అతనితో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ఓ నిందితుడు తన కొడుకును హాస్టల్‌ చేర్పించాడు. కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు తండ్రితో పాటు అసలు సూత్రధారులు రంగంలోకి దిగారు. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక కారులో ఎక్కించుకుని శ్రీశైలం వైపు తీసుకెళ్లి హత్య చేశారు. తమ బంధువని చెప్పి అంత్యక్రియలు కూడా జరిపించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి 6ఏళ్లుగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌పీ కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి స్వామీజీ త్రిలోక్నాథ్ అలియాస్ గురూజీతో పరిచయమైంది. గురూజీ ద్వారా మాజీ సైనికోద్యోగి మల్లేష్, కృష్ణంరాజు, రియల్టర్ సుధాకర్ పరిచయమయ్యారు. గురూజీ, అతని స్నేహితులతో విజయ్ భాస్కర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. అయితే గురూజీ చేస్తున్న మోసాలపై సీబీఐ, సీఐడీకి ఫిర్యాదు చేస్తానంటూ విజయ్ భాస్కర్ రెడ్డి బెదిరించేవాడు. దీంతో విజయ్‌భాస్కర్‌ రెడ్డిని హత్యచేయాలని గురూజీ అతని స్నేహితులు డిసైడ్‌ అయ్యారు.

విజయ్ భాస్కర్ రెడ్డి కదలికలను గమనించేందుకు అతను ఉంటున్న హాస్టల్‌లోనే 5నెలల కిందట మల్లేష్ తన కొడుకు కార్తీక్‌ను చేర్పించాడు. రియల్టర్‌ గత నెల 19న విజయ్ భాస్కర్ రెడ్డి అతని ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇదే అదనుగా భావించిన నిందుతులు విజయ్‌భాస్కర్‌ రెడ్డి తీసుకునే ఆహారంలో కార్తీక్‌ మత్తు మందు కలిపాడు. అతను స్పృహ కోల్పోయాక మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు హాస్టల్‌కి చేరుకొని విజయ్ భాస్కర్ రెడ్డిని కారులో ఎక్కించుకుని శ్రీశైలం వైపు తీసుకెళ్లారు. మత్తులో ఉండగానే అతన్ని దారుణంగా కొట్టి చంపేశారు.

శవాన్ని సున్నిపెంట వరకు తీసుకెళ్లి ఓ కాటికాపరిని సంప్రదించారు. తమ బంధువు చనిపోయాడని అంత్యక్రియలు జరిపించాలని చెప్పాడు. అనుమానం వచ్చిన కాటికాపరి శవాన్ని కాల్చేముందు హంతకులకి తెలియకుండా ఫోటో తీశాడు. ఆ ఫొటో ఆధారంగానే విజయ్ భాస్కర్ రెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మత్తు టాబ్లెట్స్ ఇచ్చిన ఆర్ఎంపీ శ్రవణ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. గురూజీ, మల్లేష్ కుమారుడు కార్తీక్ పరారీలో ఉన్నారు. గురూజీ పట్టుబడితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు స్పెషల్‌ టీంలు నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories