Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త

Shocking News For Liquor Lovers In Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త

Highlights

Hyderabad: రేపు నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ లాంటి వార్త ఇది. రేపు నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 23న నగరంలో మద్యం షాపులు మూసి ఉండనున్నాయని. సీపీ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ షాపులు మూసి ఉండనున్నాయని తెలియజేశారు.

నిబంధనలు ఉల్లంఘించి షాపులను తెరిచినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఈ వారంలో మద్యం షాపులు మూసి వేయడం ఇది రెండో సారి. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా నగరంలో వైన్స్‌ షాపులు మూసి ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బంద్ చేయనుండడంతో మద్యం ప్రియులకు వారంలోనే రెండు సార్లు షాక్ తగిలినట్టైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories