BJP: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌‌గా శోభా కరంద్లాజే..

BJP: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌‌గా శోభా కరంద్లాజే..
x
Highlights

BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. ఆయా రాష్ట్రాల అధ్యక్షులు జాతీయ కౌన్సిల్ సభ్యుల నియామకానికి ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించింది. ఈ నేపథ్యంలో...

BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. ఆయా రాష్ట్రాల అధ్యక్షులు జాతీయ కౌన్సిల్ సభ్యుల నియామకానికి ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం 29 మంది అధికారులతో కూడిన జాబితాలు విడుదల చేసింది బిజెపి కేంద్ర కార్యాలయం.

తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే.. నియమించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీనియర్ మంత్రులు నియమించింది. తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ,బీహార్ ,మధ్యప్రదేశ్ లకు కేంద్ర మంత్రులను ఎన్నికల అధికారులుగా నియమించింది బిజెపి. ఈ ప్రక్రియ బీజేపీ పార్టీ శక్తిని మరింత బలపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. గుజరాత్ కి భూపేంద్ర యాదవ్, కర్ణాటక కు శివరాజ్ సింగ్ చౌహన్, ఉత్తరప్రదేశ్ కు పీయూష్ గోయల్, బీహార్ కు మనోహర్ లాల్ కట్టర్, మధ్యప్రదేశ్ కు ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల అధికారులుగా నియమితులయ్యారు.

ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించింది. అయితే కాకుండా యాక్టివ్ మెంబర్షిప్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగలోపు బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి జాతీయ అధ్యక్షుడు వారికి అన్ని స్థాయిల ఎన్నికల నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఈ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించనున్నారు. ఈ క్రమంలోనే కీలక నాయకులను ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులుగా నియమించింది బిజెపి పార్టీ.

Show Full Article
Print Article
Next Story
More Stories