Hyderabad: అమ్మా పెద్దమ్మతల్లి నా కుటుంబానికి నువ్వే దిక్కు.. మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం..

Shejal Once Again Suicide Attempt at Peddamma Thalli Temple
x

Hyderabad: అమ్మా పెద్దమ్మతల్లి నా కుటుంబానికి నువ్వే దిక్కు.. మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం..

Highlights

Hyderabad: ఆరిజన్ డెయిరీకి చెందిన శేజల్‌ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది.

Hyderabad: ఆరిజన్ డెయిరీకి చెందిన శేజల్‌ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. పెద్దమ్మ టెంపుల్‌ దగ్గర శేజల్ స్పృహ తప్పి పడిపోయింది. శేజల్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు లభ్యమయ్యాయి. అయితే.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శేజల్‌.. గతంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని శేజల్‌ను ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు.. శేజల్‌ బ్యాగ్‌లో సూసైడ్‌ లెటర్‌ లభ్యమైంది. అమ్మా పెద్దమ్మతల్లి నా కుటుంబానికి నువ్వే దిక్కు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు.. నా ఫొటోలను అసభ్యకరంగా చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానంటూ రాసిన సూసైడ్‌ లెటర్‌ శేజల్‌ బ్యాగ్‌లో దొరికింది.

Show Full Article
Print Article
Next Story
More Stories