ACB Raids in Telangana : ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ

ACB Raids in Telangana : ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ
x
Highlights

ACB Raids in Telangana: ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఏఎస్‌ఐలు ఏసీబీకి చిక్కారు. సైబరాబాద్ కమిషనరేట్...

ACB Raids in Telangana: ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఏఎస్‌ఐలు ఏసీబీకి చిక్కారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ లో గురువారం సోదాలు నిర్వ‌హించారు ఏసీబీ అధికారులు. సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రూ. లక్ష 25 వేలు లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

ఓ భూవివాదంలో డ‌బ్బులు డిమాండ్ చేయ‌గా బాధితులు ఏసీబీని ఆశ్ర‌యించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా సీఐ, ఏఎస్‌ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సీఐ, ఏఎస్‌ఐని రిమాండ్ కు తరలించారు. ఇద్దరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో షాద్‌నగర్‌ సీఐగా పనిచేసిన శంకరయ్యపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. దీంతో అధికారులు ఆయనను సైబరాబాద్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు. ఇటీవలే షాబాద్‌కు సీఐగా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఏసీబీకి దొరికిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories