భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు
x

representational image 

Highlights

* బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా భూమా అఖిలప్రియ * ఏవీ సుబ్బారెడ్డి ఏ2, భార్గవ్‌రామ్‌ను ఏ3గా పేర్కొన్న పోలీసులు * భూమా అఖిలప్రియపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా భూమా అఖిలప్రియను చేర్చారు పోలీసులు. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, భార్గవ్ రామ్ ఏ3గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాష్ ను నిందితులుగా పోలీసులు చేర్చారు. భూమా అఖిలప్రియపై అదనంగా ఐపీసీ సెక్షన్ 147, 385 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. హఫీజ్ పేట సర్వే నెంబర్ 80లో 2016లో బాధితులు భూములు కొన్నారని పోలీసులు తెలిపారు. 25 ఎకరాలను బాధితులు కొనుగోలు చేయగా భూమి తమదేనని అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవ్ రామ్ వాదిస్తున్నారన్నారు. సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకోగా ఇప్పుడు భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories