Phone Tapping Case: A4 రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Sensational Things In A4 Radhakishan Rao Remand Report
x

Phone Tapping Case: A4 రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Highlights

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు

Phone Tapping Case: హైదరాబాద్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A4 గా ఉన్న రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్‌రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు నగదు సీజ్ చేశామని రాధాకిషన్‌ ఒప్పుకున్నారు. అలాగే.. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన మూడున్నర కోట్లు సీజ్ చేసినట్టు రాధాకిషన్‌ అంగీకరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు. నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌ సిటీకి తిరుపతన్నను నియమించుకున్నట్టు రాధాకిషన్‌రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories