సికింద్రాబాద్ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్గ్రేషియా..!
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోఎనిమిది మంది మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ ఘనలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్లకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 13, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire