BJP National Executive: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Second Day of BJP National Executive Meeting
x

BJP National Executive: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Highlights

BJP National Executive: ఉ.10 గంటల నుంచి సా.4గంటల వరకు కొనసాగనున్న సమావేశం

BJP National Executive: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఇవాళ ఉదయం 10గంటలకు మొదలవుతాయి. సాయంత్రం నాలుగున్నర గంటలకు వరకు కొనసాగుతోంది. HICC వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో కీల తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరపనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా, దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది బీజేపీ. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు.

తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన బీజేపీ.. కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితిపై ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగానే ప్రకటించింది. మొదటిరోజే దీనిని విడుదల చేయాలని నిర్ణయించినా సమయాభావం వల్ల రెండోరోజుకు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామని, కార్యవర్గంలో చర్చించిన తర్వాత విడుదల చేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది

తొలి రోజు సమావేశాల్లో భాగంగా పలు కీలక అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో రోజు సమావేశాలు మొదలవుతాయి. సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశాలు జరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories