Telangana: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

Scrutiny of Nominations Completed in Telangana
x

Telangana: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

Highlights

Telangana: 119 నియోజకవర్గాలకు 4,798 నామినేషన్లు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యింది. 119నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో అభ్యర్ధులు నామినేషన్‌లు దాఖలు చేయగా..అందులో కొన్ని... ఎన్నికల కమిషన్‌ సూచించిన విధంగా లేకపోవడంతో తిరస్కరించారు అధికారులు. ఇందులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. వీటితో పాటు మిగిలిన జిల్లాల్లో మరో 15 నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారు. అయితే సీనియర్‌ నేతగా, పలుమార్లు శాసనసభ్యుడిగా గెలిచిన జానారెడ్డి కొడుకుతో పాటు నామమాత్రంగా నామినేషన్ వేసి తిరస్కరించడంతో నెటిజన్లు సెటైర్‌లు వేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. సరైన పత్రాలు చూపించని నామినేషన్‌లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వందల కొద్ది నామినేషన్‌లు సమర్పించారు అభ్యర్ధులు. పలు జిల్లాల్లో కొన్ని తిరస్కరించారు. ముఖ్యంగా నాగర్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్ వేశారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ వేశారు.

నాగార్జునసాగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో రెండు నామినేషన్లు తిరస్కరించారు అధికారులు. అలాగే కరీంనగర్ మానకొండూరులో ఏడు నామినేషన్లు, నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కొల్లాపూర్ నుంచి 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా..... 18 మందివి ఆమోదం పొందాయి. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో మిగిలిన మూడింటిని తిరస్కరించారు.

ఇప్పటి వరకు నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఇక పోలింగ్ తేదీ వరకు ఇంకా ఎంత మంది తమ నామినేషన్‌లను విత్‌ డ్రా చేసుకుంటారో... ఎంత మంది బరిలో ఉంటారో చూడాలి. చివరకు ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు విజేతగా నిలుస్తాడో తెలియాలంటే వచ్చే నెల 3వ తేది వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories